హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా గాజాలో సేఫ్ జోన్‌గా ప్రకటించిన ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఈ దాడుల్లో 60మందికి పైగా పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్ శివారులోని మువాసీ ప్రాంతం ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా పరిగణిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులతో ఇక్కడ ఆశ్రయం పొందేందుకు వచ్చిన వేలాది మంది శరణార్థులు ఈ ప్రాంతంలో తలదాచుకుంటున్నారు. ఐడీఎఫ్ కూడా ఈ ప్రాంతాన్ని తమ సేఫ్ జోన్ జాబితాలో చేర్చినట్లు ఇటీవల ప్రకటించింది. నిరాశ్రయులు ఇక్కడే ఉండొచ్చని సూచించింది. అయితే అక్కడే ఓ గ్యాస్ స్టేషన్‌కు సమీపంలో ఏర్పాటు చేసుకున్న గుడారాలపైనే తాజాగా భీకర దాడులు జరిగాయి. వీరిలో 17 మంది మృతి చెందినట్లు గాజా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఒక్క రాత్రిలో జరిగిన దాడుల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 60కిపైగా పెరిగింది. సురక్షిత ప్రాంతంలో దాడులు జరపడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సేఫ్ జోన్‌పై ఇజ్రాయెల్ దాడి- 60మందికి పైగా మృతి
Published : Jul 16, 2024, 10:24 PM IST