ETV Bharat / snippets

'ఇకపై 16 రకాల పురుగులు తినొచ్చు'- ప్రభుత్వం పర్మిషన్- రెస్టారెంట్​ యజమానులు ఫుల్ ఖుష్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 4:45 PM IST

Insects Food In Singapore
Insects Food In Singapore (GettyImages)

Insects Food In Singapore : సింగపూర్​లో కీటకాలను ఆహారంలో భాగం చేసింది అక్కడి ప్రభుత్వం. మిడతలు, పట్టు పురుగులు, గొల్లభామ సహా మొత్తం 16 కీటకాలను ఆహారంగా వినియోగించుకునేందుకు సింగపూర్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చైనీస్, భారతీయ వంటకాలతో సహా ప్రపంచ ఆహార మెనూలో ఈ కీటకాల జాబితాను చేర్చింది. చైనా, థాయ్ లాండ్, వియత్నాం నుంచి ఈ కీటకాలు సింగపూర్​కు సరఫరా కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కీటకాలతో ఆహారం తయారుచేసే హోటల్స్, రెస్టారెంట్ యజమానులు ఆనందం వ్యక్తం చేశారు.

కీటకాల ఆహార ఉత్పత్తుల విషయంలో కూడా ఆహార భద్రత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటుంది. కాగా, పురుగులను మాంసానికి ప్రత్యామ్నాయ ఆహారంగా యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కొన్నాళ్ల క్రితం ప్రకటించింది. కీటకాల్లో అధిక ప్రొటీన్ ఉంటుందని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.