ETV Bharat / snippets

ఇరాన్‌లో హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హత్య- ఇజ్రాయెల్ పనేనా?!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 10:26 AM IST

Hamas Chief Killed in Iran
Hamas Chief Killed in Iran (Associated Press)

Hamas Chief Killed in Iran : గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తున్న హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్‌ టీవీ బుధవారం ప్రకటించింది. మరోవైపు దీనిని ఇజ్రాయెల్ దాడిగా అభివర్ణిస్తూ హమాస్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకారకార్యక్రమానికి హాజరై తిరిగి టెహ్రాన్​లో ఉన్న ఇంటికి వచ్చాక ఈ దాడి జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనలో హనియా, ఆయన బాడీగార్డ్ మృతి చెందినట్లు పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.