ETV Bharat / snippets

ప్రయాణికులు, సిబ్బందికి ఒకేసారి వాంతులు- విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 4:12 PM IST

US Flight Diverted Due To Vomiting
US Flight Diverted Due To Vomiting (ANI)

US Flight Diverted Due To Vomiting : విమానం గాల్లో ఉండగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఓ ప్రయాణికుడికి ఎడతెగని విధంగా వాంతులయ్యాయి. దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తమకు మాస్కులు ఇవ్వాలని విమాన సిబ్బందిని కోరారు. ఈ క్రమంలో విమానంలోని సిబ్బందికి కూడా వాంతులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని హ్యూస్టన్ నుంచి బోస్టన్‌కు బయలుదేరిన బోయింగ్ 737-800 మోడల్‌కు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని (UA2477) మార్గమధ్యంలోనే వాషింగ్టన్​లోని డల్లస్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. వెంటనే విమానంలోని 155 మంది ప్రయాణికులు, సిబ్బంది అక్కడ దిగారు. అనంతరం విమానాన్ని పూర్తిగా శుభ్రపరిచారు. మరోవైపు డాలస్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రయాణికులను బోస్టన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. జులై 28న జరిగింది ఈ ఘటన.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.