ETV Bharat / snippets

షీజియాంగ్ ఉగ్రరూపం- చైనాలో వరద బీభత్సం- 1800మందికిపైగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 7:42 PM IST

China Floods
China Floods (Associated Press)

China Floods : గతవారం రోజులుగా చైనాలోని దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగడం వల్ల పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షానికి గుయాంగ్జీ పట్టణం మీదుగా ప్రవహించే షీజియాంగ్‌ నదిలో నీటిమట్టం పెరిగింది. గుయాంగ్జీలో భారీ వరద పోటెత్తింది. రహదారులపై నీరు కూడా నిలిచిపోయింది. నీటిమట్టం రెండుమీటర్ల మేర ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 1800మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిజియాంగ్ ప్రావిన్స్‌లో వర్షానికి కొండచరియలు విరిగిపడటం వల్ల 16మీటర్ల పొడవునా రహదారి ధ్వంసమయ్యింది. దీంతో మూడు గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఆయా గ్రామాల్లో 900మంది ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రహదారి పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. దక్షిణ భాగంలో భారీ వర్షాలు కురుస్తాయని ఆయా ప్రావిన్స్‌లను చైనా జాతీయ వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.