ETV Bharat / snippets

'ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్​కు భద్రత కల్పిస్తాం' - నెతన్యాహుకు బైడెన్​ అభయం!

Biden calls Netanyahu, reaffirms commitment to Israel's security against threats from Iran
Biden calls Netanyahu (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 8:38 AM IST

Biden Calls Netanyahu : ఇజ్రాయెల్​ భద్రతకు అమెరికా అన్ని విధాలుగా సహకరిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహుతో ఫోన్​లో మాట్లాడిన బైడెన్,​ ఇరాన్ నుంచి వచ్చే అన్ని రకాల బెదిరింపులకు, వ్యతిరేకంగా ఇజ్రాయెల్​ భద్రతకు అమెరికా సహకరిస్తుందని పునరుద్ఘాటించారు. ​బైడెన్​తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా నెతన్యాహూతో ఫోన్​లో మాట్లాడారని శ్వేత సౌధం వెల్లడించింది.

'ఇరాన్​ నుంచి, హమాస్​, హిజ్బుల్లా, హౌతీ లాంటి ఉగ్రవాద గ్రూపుల నుంచి వచ్చే అన్ని రకాల బెదిరింపులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రతకు తాము సహకరిస్తామని జోబైడెన్ స్పష్టం చేశారు. అలాగే ఇరాన్​ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్​లతో చేస్తున్న దాడులకు ప్రతిగా, యూఎస్​ మిలటరీ సహకారాన్ని ఇజ్రాయెల్​కు ఇచ్చేందుకు సముఖం వ్యక్తం చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గించడానికి అమెరికా కట్టుబడి ఉందని బైడెన్ స్పష్టం చేశారు' అని వైట్​హౌస్ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.