ETV Bharat / snippets

'కమలా హారిస్ ఇండియనా? నల్లజాతీయురాలా?'- డొనాల్డ్ ట్రంప్ సూటి ప్రశ్న

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 10:24 AM IST

Donald Trump Kamala Harris
Donald Trump Kamala Harris (Source: APTN)

Donald Trump Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారపర్వం జోరుగా కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కమలపై డొనాల్డ్ ట్రంప్ షికాగోలో జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ కన్వెన్షన్‌ లో తీవ్ర విమర్శలు గుప్పించారు. కమలా హ్యారిస్ భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా? అని ప్రశ్నించారు. కమల ఎప్పుడూ భారతీయ వారసత్వాన్నే ప్రచారం చేశారని, ఇప్పుడు నల్ల జాతీయురాలిగా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. కమలా హ్యారిస్‌పై వ్యక్తిగత దాడి చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ విభజనకు తెరలేపారని, అలాగే పాత ప్రదర్శనే చేశారని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.