ETV Bharat / snippets

IVF ద్వారా పిల్లలు కనేవారికి వాయు కాలుష్యంతో ఇబ్బందులు- అన్నీ లింకే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 9:38 AM IST

Air Pollution Effect On IVF Treatment
Air Pollution Effect On IVF Treatment (Etv Bharat)

Air Pollution Effect On IVF Treatment : ఐవీఎఫ్‌ పద్ధతిలో సంతానాన్ని పొందాలనుకునేవారికి వాయు కాలుష్యంతో ఇబ్బంది తలెత్తవచ్చట. ఆ విధానం ఫలించి శిశువు జన్మించడానికి ఉన్న అవకాశాలు సదరు మహిళ ఉన్న ప్రాంతంలో వాయు నాణ్యతతో ముడిపడి ఉన్నాయట. ఈ విషయాన్ని ఓ అధ్యయనం తేల్చింది. వాయు కాలుష్య ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆస్ట్రేలియాలో 3,660 ఐవీఎఫ్‌ ప్రక్రియలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. మహిళ నుంచి పరిపక్వత చెందని అండం (ఊసైట్‌) సేకరించడానికి 24 గంటలు, రెండు వారాలు, నాలుగు వారాలు, మూడు నెలల ముందు ఆయా ప్రాంతాల్లోని వాయు కాలుష్య స్థాయిని విశ్లేషించారు. అధ్యయనం జరిగిన కాలంలో పీఎం10 రేణువులు 0.4 రోజులు, పీఎం2.5 రేణువులు 4.5 రోజుల పాటు మాత్రమే ఎక్కువ మోతాదులో ఉన్న సందర్భాల్లోనూ ఐవీఎఫ్‌ విధానంపై ప్రతికూల ప్రభావం పడింది. మిగతా రోజుల్లో వాయు నాణ్యత అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.