ETV Bharat / snippets

సూర్య, కార్తి మంచి మనసు - వయనాడ్‌ బాధితుల కోసం ఏం చేశారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 3:45 PM IST

source ETV Bharat
Wayanad landslide tragedy Hero Suriya Donates 50Lakhs (source ETV Bharat)

Wayanad landslide tragedy Hero Suriya Donates 50Lakhs : వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. ఈ హృదయవిదారక ఘటనలో వందల మంది మృతిచెందారు. దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. రీసెంట్​గా కోలీవుడ్ నుంచి విక్రమ్​ రూ.20 లక్షలు విరాళం ప్రకటించగా ఇప్పుడు సూర్య ఫ్యామిలీ కూడా ఇదే చేసింది. సూర్య, జ్యోతిక, కార్తి కలిసి రూ.50 లక్షలను కేరళ సీఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఈ ఘటన తమను ఎంతగానో కలచి వేసిందని సూర్య అన్నారు. "ఇది హృదయ విదారక ఘటన. రెస్క్యూ ఆపరేషన్​ చేస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ప్రమాదంలో చనిపోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానుఠ అని విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై మాలీవుడ్ ఇండస్ట్రీ కూడా విచారం వ్యక్తం చేసింది. కొన్ని రోజులపాటు సినిమా ఈవెంట్లు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.