ETV Bharat / snippets

ఆ దేశంలో వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి! - ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 5:20 PM IST

http://10.10.50.75:6060/reg-lowres/12-June-2024/up-mer-04-schemeaboutfarmers-pkg-7202281_12062024171006_1206f_1718192406_962.jpg
http://10.10.50.75:6060/reg-lowres/12-June-2024/up-mer-04-schemeaboutfarmers-pkg-7202281_12062024171006_1206f_1718192406_962.jpg (http://10.10.50.75:6060/reg-lowres/12-June-2024/up-mer-04-schemeaboutfarmers-pkg-7202281_12062024171006_1206f_1718192406_962.jpg)

Varalakshmi Sarathkumar Marriage : నటి వరలక్ష్మి శరత్‍కుమార్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే మార్చిలో నిశ్చితార్థం జరిగింది. నికోలై సచ్‍దేవ్‍ను ఆమె వివాహమాడనున్నారు. అయితే తాజాగా ఆమె ఎక్కడ పెళ్లి చేసుకోనుందో సమాచారం అందుతోంది. ఆమె మరో దేశంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహం జూలై 2వ తేదీన జరుగనుందంటూ ప్రచారం సాగుతోంది. థాయ్‍లాండ్‍లో గ్రాండ్‍గా పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. థాయ్‍లాండ్‍లో ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. పెళ్లికి ముందు మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాన్ని మాత్రం చెన్నైలోనే జరుపుకోవాలని వరలక్ష్మి నిర్ణయించుకున్నారట. పెళ్లి తర్వాత రిసెప్షన్‍ను చెన్నైలో నిర్వహించాలని వరలక్ష్మి ప్లాన్ చేసుకున్నారట. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. కాగా, గ్యాలరిస్ట్ నికోలై సచ్‍దేవ్‍తో వరలక్ష్మి శరత్ కుమార్ దాదాపు పదేళ్ల పరిచయం ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.