ETV Bharat / snippets

'అమ్మ అలా చేయొద్దని చెప్పింది - అందుకే ఆ విధంగా అస్సలు కనిపించను'

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 8:47 PM IST

source ETV Bharat
ulajh Janhvi kapoor (source ETV Bharat)

ulajh Janhvi kapoor : 'ఎలాంటి పాత్రలో నటించకూడదని అనుకుంటున్నారు?' అని ఓ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు జాన్వీకపూర్ సమాధానమిచ్చింది. తన కెరీర్‌ను మార్చేదైనా, జుట్టు లేకుండా కనిపించే పాత్రను మాత్రం అస్సలు అంగీకరించనని తెలిపింది. "జుట్టు లేకుండా నటించాల్సి వస్తే నేను కచ్చితంగా నో చెబుతాను. ఎంత కష్టమైన పాత్రను అయినా చేస్తాగానీ జుట్టులేకుండా మాత్రం కనిపించను. ఉలఝ్‌లో నా పాత్ర కోసం దర్శకుడు హెయిర్‌ను కొంత కట్‌ చేయాలని అన్నారు. కానీ నేను గొడవపడ్డా(నవ్వుతూ). నా మొదటి సినిమా ‘ధడక్‌’ కోసం జుట్టు కత్తిరించుకున్నాను. ఎందుకిలా చేశావ్‌? అని మా అమ్మ అరిచింది. ఏ పాత్ర కోసమైనా జుట్టు మాత్రం కట్‌ చేసుకోవద్దని సూచించింది. నా హెయిర్ అంటే ఆమెకు అంత ఇష్టం. ప్రతి మూడు రోజులకు ఓ సారి ఆయిల్‌ రాసి మసాజ్‌ చేసేది. అందుకే అమ్మ కోసం హెయిర్‌ కట్ చేసుకోను’’ అని చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.