ETV Bharat / snippets

బాలయ్య గోల్డెన్ జూబ్లీ- గ్రాండ్​గా సెలబ్రేషన్స్- ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 6:56 AM IST

Balakrishna 50 Years
Balakrishna 50 Years (Source: ETV Bharat)

Balakrishna 50 Years: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసి 2024 ఆగస్టు 30తో 50ఏళ్లు పూర్తవుతుంది. ఆయన నటించిన తొలి సినిమా 'తాతమ్మ కల' 1974 ఆగస్టు 30న రిలీజైంది. ఈ సినిమాకు ఆయన తండ్రి లెజెండరీ నటుడు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. కాగా, ఆయన సినీ ప్రయాణంలో కళారంగానికి చేసిన కృషి, సేవలకుగాను తెలుగు ఇండస్ట్రీ ఆయనను ఈ ఏడాది సెప్టెంబరు 1న ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది.

ఈ మేరకు సన్మాన వేడుకకు అంగీకారం తెలపాల్సిందిగా ఇండస్ట్రీ మెంబర్లు తాజాగా బాలకృష్ణను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి బాలయ్య అంగీకరించారు. ఇక ఈ వేడుకకు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ 50ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో బాలయ్య హీరోగా 108 సినిమాలు చేశారు. అందులో అనేక సినిమాలు బ్లాక్​బస్టర్ హిట్ కొట్టాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.