ETV Bharat / state

గుడ్​న్యూస్ - హైదరాబాద్​లో మరో ఇంటర్నేషనల్ స్టేడియం - త్వరలో స్పోర్ట్స్ పాలసీ - ONE MORE INTERNATIONAL STADIUM HYD - ONE MORE INTERNATIONAL STADIUM HYD

One More international stadium in Hyderabad : హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీ సమీపంలో బ్యాగరికంచెలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించినట్లు ఆయన తెలిపారు. క్రీడల కోసం బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించామన్నారు. త్వరలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని వెల్లడించారు

CM Revanth on Sports Policy
CM Revanth on Sports Policy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 12:36 PM IST

Updated : Aug 2, 2024, 1:25 PM IST

CM Revanth on New Sports Policy in Telangana : రాష్ట్రంలో క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగా త్వరలో నూతన క్రీడా విధానం తేబోతున్నట్లు ఆయన ప్రకటించారు. స్పోర్ట్స్​ పాలసీకి హరియాణా క్రీడా విధానం పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

బీసీసీఐతో చర్చలు : హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీ సమీపంలో బ్యాగరికంచెలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించినట్లు తెలిపారు. క్రీడల కోసం బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించామన్నారు. స్పోర్ట్స్ పాలసీపై ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని స్పష్టం చేశారు. భూముల లభ్యత చూసి మండల కేంద్రాల్లో స్టేడియాలు నిర్మిస్తామని చెప్పారు.

క్రీడాకారులకు ప్రోత్సాహం : అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన బాక్సర్​ నిఖత్ జరీన్‌కు ఆర్థిక సాయం చేసి ఇంటిస్థలం కేటాయించామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. అలాగే క్రికెటర్​ సిరాజ్‌కు విద్యార్హత లేకున్నా గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తున్నట్లు వెల్లడించారు. చ‌దువులోనే కాదు, క్రీడ‌ల్లో రాణిస్తే కూడా ఉన్న‌త ఉద్యోగం వ‌స్తుంద‌ని కుటుంబం గౌర‌వం పెరుగుతుంద‌ని సీఎం పేర్కొన్నారు.

హైదరాబాద్​లో గతంలో నిర్మించిన స్టేడియాలు ప్రైవేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వీటన్నింటినీ అప్ గ్రేడ్ చేసి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలనుకుంటుందని, అందుకు అంద‌రి మ‌ద్ద‌తు అవసరమని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు త‌మ‌కు ఎలాంటి అభ్యంతరం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

"రాష్ట్రంలో క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాం. త్వరలో నూతన క్రీడా విధానం తీసుకురాబోతున్నాం. స్పోర్ట్స్​ పాలసీకి హరియాణా క్రీడా విధానం పరిశీలిస్తున్నాం. క్రీడల కోసం బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించాం. హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తాం. స్కిల్ యూనివర్సిటీ సమీపంలో బ్యాగరికంచెలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించాం". - రేవంత్​రెడ్డి, సీఎం

గత పాలకులు మూడు నగరాలు నిర్మించారు - మేము నాలుగో సిటీని నిర్మిస్తాం : సీఎం రేవంత్ - Young India Skill University

స్కిల్ యూనివర్సిటీలో 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నాం : రేవంత్ రెడ్డి - CM Revanth On Skill University

Last Updated : Aug 2, 2024, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.