ETV Bharat / snippets

మంచు వారి గారాల పట్టి నేమింగ్ సెర్మనీ- పేరులో ఏముందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 2:03 PM IST

Manchu Manoj Daughter Name
Manchu Manoj Daughter Name (Source: ETV Bharat)

Manchu Manoj Daughter Name: టాలీవుడ్ స్టార్ కపుల్ మంచు మనోజ్- మౌనిక దంపతులు తమ కూతురుకి సోమవారం నామకరణం చేశారు. చిన్నారికి 'దేవసేన శోభా' అనే పేరును నామకరణం చేసినట్లు హీరో మనోజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'మా బంగారు తల్లి పరిచయం' అనే క్యాప్షన్​తో ఓ నోట్ రాశారు.

'మీ అందరి, ఆ శివుడి ఆశీస్సులతో మా కూతురుకి దేవసేన శోభా అనే పేరు పెట్టాం. ఆ పరమేశ్వరుని భక్తులమైన మేము మా చిన్నారి పేరును సాక్ష్యాత్తు శివుని కుటుంబంలోని సుబ్రహ్మణ్యస్వామి భార్య 'దేవసేన' పేరును మా పాపకు పెట్టుకున్నాం. మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి గారి పేరు నుంచి 'శోభ' పేరును తీసుకున్నాం. మా ఇంటి దీపం, మా కంటి వెలుగు, చిన్నారి దేవసేన శోభకు అందరి దీవెనలు కావాలి' అని మనోజ్ నోట్​ రాసుకొచ్చారు. మనోజ్- మౌనిక గతేడాది మార్చిలో వివాహం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.