ETV Bharat / snippets

పుష్ప ఈజ్​ బ్యాక్​ - షూటింగ్ ఇప్పుడు ఎక్కడ జరుగుతోందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 6:23 AM IST

source ETV Bharat
Pushpa 2 Shooting (source ETV Bharat)

Pushpa 2 shooting Ramoji film city : పుష్ప 2పై రకరకాల రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షూటింగ్​ను వీలైనంత త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా అల్లుఅర్జున్‌ మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఈమధ్యే ఆయన బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో ఫారెన్ టూర్ వెళ్లారు. అయితే పుష్ప2 కోసం పెంచిన గడ్డం తీసేసి వెళ్లడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడాయన తిరిగొచ్చి వచ్చే నెల తొలి వారం నుంచి పుష్ప2 మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే షూటింగ్​ పునః ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఇతర నటులపై కొన్ని సీన్స్​ తెరకెక్కిస్తున్నారు. ఈ కొత్త షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌పై క్లైమాక్స్​​ సీన్స్​ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. పుష్ప : ది రైజ్‌కు కొనసాగింపుగా ఇది రూపొందుతోంది. రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. సుకుమార్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. డిసెంబరు 6న సినిమా విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.