ETV Bharat / snippets

NBK గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్​- చిరు, వెంకీ సహా స్టార్ హీరోల సందడి

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 9:33 PM IST

NBK 50 Years Celebration
NBK 50 Years Celebration (Source: ETV Bharat)

NBK 50 Years Celebration Guests: నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్​ హైదరాబాద్​లో ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఈ ఈవెంట్​ను గ్రాండ్​గా నిర్వహించింది. టాలీవుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల ప్రముఖులు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు ఈ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితోపాటు విక్టరీ వెంకటేశ్, శివ రాజ్‌కుమార్‌, ఉపేంద్ర, శ్రీకాంత్‌, గోపీచంద్‌, నాని, దగ్గుబాటి రానా, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు ఈవెంట్‌లో పాల్గొన్నారు.

ఇక డైరెక్టర్లలో గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను కూడా ఈవెంట్​లో మెరిశారు. టాలీవుడ్ లెజెండ్ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి బాలకృష్ణను శాలువాతో సత్కరించారు. బాలకృష్ణ కుటుంబ సభ్యులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వేడుకకు హాజరయ్యారు. ఈ ఈవెంట్​కు సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.