SIIMA Awards 2024 Winners : దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) - 2024 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దక్షిణాది భాషల సంబంధించిన నటీనటులందరూ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ ఇండస్ట్రీలను అవార్డులతో సత్కరించింది సైమా. 2023 ఏడాదిలో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులు, అలాగే మూవీ టీమ్స్‌కు ఈ పురస్కారాలు అందించారు. అదిరిపోయే ఔట్ఫిట్లతో అందాల భామలు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. శ్రేయ, ఫరియా అబ్దుల్లా, నేహాశెట్టి, శాన్వీ లాంటి స్టార్స్ తమ డ్యాన్స్ పెర్ఫామెన్స్లతో అలరించారు.
ఇక 'దసరా' సినిమాకు అవార్డుల పంట పండింది. ఈ నేపథ్యంలో బెస్ట్ యాక్టర్‌గా నేచులర్ స్టార్ నాని ప్రతిష్టాత్మక అవార్డు అందుకోగా, బెస్ట్ యాక్ట్రెస్‌గా కీర్తి సురేశ్ అవార్డును అందుకున్నారు. ఇదిలా ఉండగా, బెస్ట్ మూవీ కేటగిరిలో బాలకృష్ణ 'భగవంత్ కేసరి' ఈ పురస్కారాన్ని అందుకుంది.
The @NameisNani takes home the award for Best Actor (Telugu) in a Leading Role at SIIMA 2024! His extraordinary talent and dedication shine through in every scene of Dasara.
— SIIMA (@siima) September 14, 2024
Confident Group SIIMA Weekend Dubai#SIIMA2024 #SIIMAinDubai #NEXASIIMA #ConfidentGroup… pic.twitter.com/CoOwBexh1F
సైమా 2024 అవార్డుల విజేతలు వీరే!
- బెస్ట్ యాక్టర్ : నాని (దసరా)
- బెస్ట్ యాక్ట్రెస్ : కీర్తి సురేశ్ (దసరా)
- బెస్ట్ డైరెక్టర్ : శ్రీకాంత్ ఓదెల (దసరా)
- బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) : ఆనంద్ దేవరకొండ (బేబీ)
- బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్): మృణాళ్ ఠాకూర్
- బెస్ట్ మూవీ : భగవంత్ కేసరి
- బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ : దీక్షిత్ శెట్టి (దసరా)
- బెస్ట్ యాక్ట్రస్ ఇన్ సపోర్టింగ్ రోల్ : బేబీ ఖియారా ఖాన్ (హాయ్ నాన్న)
- బెస్ట్ డెబ్యూ యాక్టర్ : సంగీత్ శోభన్ (మ్యాడ్)
- బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ : వైష్ణవి చైతన్య (బేబీ)
- బెస్ట్ కమెడియన్ : విష్ణు (మ్యాడ్)
- బెస్ట్ మ్యూజిక్ డెరెక్టర్ : అబ్దుల్ వాహబ్ (హాయ్‌నాన్న, ఖుషి)
- బెస్ట్ సినిమాటోగ్రఫీ : భువన గౌడ (సలార్)
- బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ సింగర్ : రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు-బలగం)
- బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : శౌర్యువ్ (హాయ్ నాన్న)
- బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ : వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ (హాయ్ నాన్న)
- బెస్ట్ డైరెక్టర్ (క్రిటిక్స్) : సాయి రాజేశ్
SIIMA 2024 అవార్డ్స్ నామినేషన్ - నాని, రజనీకాంత్ సినిమాల హవా