ETV Bharat / state

'లేక్ ప్రొటెక్షన్‌ ఫోర్స్' : ఇకపై చెరువులను ఆక్రమించడం కాదు - ఆ ఆలోచన వచ్చినా 'హైడ్రా'కు తెలిసిపోతుంది - Lake Protection Teams In Hyderabad - LAKE PROTECTION TEAMS IN HYDERABAD

Lake Protection Teams In Hyderabad : చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపైనే కాకుండా వాటి రక్షణ కోసం హైడ్రా ప్రత్యేకంగా నిఘా పెడుతోంది. ఇకపై చెరువును ఆక్రమించాలన్న ఆలోచన వస్తే చాలు హైడ్రాకు సమాచారం అందేలా ప్రత్యేకంగా "లేక్ ప్రొటెక్షన్‌ ఫోర్స్"ను ఏర్పాటు చేసింది. ఒక్కో చెరువునకు ఇద్దరి చొప్పున రక్షకులను ఏర్పాటు చేసింది. వారి నిఘాలో ఎప్పటికప్పుడు చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షిస్తోంది.

Hydra Deployed Lake Protection Teams in Hyderabad
Hydra Deployed Lake Protection Teams in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 7:21 AM IST

Updated : Sep 15, 2024, 11:28 AM IST

Hydra Deployed Lake Protection Teams in Hyderabad : రాష్ట్ర రాజధానిలో ఇక నుంచి చెరువులను ఇష్టానుసారంగా ఆక్రమించకుండా, వ్యర్థాలతో నింపకుండా హైడ్రా కఠిన చర్యలకు సిద్ధమైంది. చెరువుల రక్షణ కోసం 'లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్'​ను ఏర్పాటు చేసింది. ఒక్కో చెరువునకు ఇద్దరు సిబ్బంది చొప్పున రోజంతా వాటిపై నిఘా వేసి ఉంచనున్నారు. కంటికి రెప్పలా వాటిని కాపాడటమే లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ బాధ్యత. నీలం రంగు డ్రెస్ కోడ్‌తో ఉండే సిబ్బంది చెరువుల వద్ద ఆక్రమణలు జరిగినా, నిర్మాణాలకు ప్రయత్నించినా, నిర్మాణ వ్యర్థాలతో పూడ్చేందుకు యత్నించినా వెంటనే హైడ్రాకు సమాచారాన్ని ఇవ్వనున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా ఆక్రమణలకు పాల్పడే వారిని అప్పటికప్పుడు అరెస్టు చేయడానికి కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు.

బల్దియా పరిధిలో 185 చెరువులుండగా హెచ్ఎండీఏ పరిధిలో 3500 చెరువులున్నాయి. మూడొంతుల చెరువులకు ఇప్పటికీ ఎఫ్​టీఎల్, బఫర్ జోన్ల హద్దులను నిర్ధారించలేదు. తుది నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో హద్దులు సరిగా లేకపోవడంతో అనేక మంది అనుమతులు లేకుండానే ఎఫ్​టీఎల్ పరిధిలో భారీ భవనాలు నిర్మించుకున్నారు. కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధుల అండతో చెరువుల గర్భంలోనే నిర్మాణాలు చేపట్టి వ్యాపారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెరువుల పరిరక్షణపై దృష్టి పెట్టిన హైడ్రా, వాటిని కూల్చివేయడమే కాకుండా చెరువును పూర్తిగా పరిరక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలేంటి? - హైడ్రా తీరుపై హైకోర్టు​ తీవ్ర అసంతృప్తి - High Court Serious On Hydra Actions

ఇప్పటి వరకు జరిగిన ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఇకపై చెరువులను ఎవరూ కబ్జా చేయకుండా ఉండేందుకు ప్రత్యేకంగా లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. హైడ్రా ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, చెరువుల వద్ద నిరంతరం నిఘా ఉండేలా సిబ్బందిని నియమించుకునేందుకు హైడ్రాకు అనుమతులు ఇచ్చింది.

మొదటి దశలో 70 చెరువుల వద్ద నిఘా : ప్రస్తుతం హైడ్రా వద్ద తగినంత సిబ్బంది లేకపోవడంతో మిగిలిన శాఖల్లో పొరుగు సేవల కింద పని చేస్తున్న కింది స్థాయి సిబ్బందిని లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్‌తో రంగంలోకి దింపింది. మొత్తం 600 మంది సిబ్బందిని ఏర్పాటు చేయాలని భావించిన హైడ్రా, మొదటి దశలో 70 చెరువుల వద్ద ఈ నిఘాను ఏర్పాటు చేసింది.

చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా నిఘా బృందాలను ఏర్పాటు చేయడం, ఉదయం, సాయంత్రం, రాత్రి వారంతా గస్తీ కాయడం పట్ల సమీపంలోని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల సమీపంలో నీలం రంగు దుస్తుల్లో సిబ్బంది కనిపించడం పట్ల వివరాలు ఆరా తీస్తూ హైడ్రా పనితీరును అభినందిస్తున్నారు.

పర్యాటక ప్రాంతాలుగా చెరువులు : హైడ్రాతో పాటు పురపాలక శాఖ కూడా కొన్ని చెరువులను సుందరీకరణ చేయాలని నిర్ణయించుకుంది. జోన్‌కు 5 చొప్పున కనీసం 50 చెరువులను ఎంపిక చేసి తీర్చిదిద్దాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో పెద్దగా ఆక్రమణలకు గురికాని చెరువులను గుర్తించి, వాటిని పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

గ్రేహౌండ్స్‌, టాస్క్‌ఫోర్స్‌ తరహాలో హైడ్రా పనిచేస్తుంది : రంగనాథ్‌ - Ranganath about Hydra

హైడ్రా పేరుతో ఓ విలేకరి డబ్బుల డిమాండ్ ​- పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిమాండ్​

Last Updated : Sep 15, 2024, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.