ETV Bharat / snippets

మీర్జాపూర్‌ 3 - సరికొత్త రికార్డు

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 9:47 PM IST

source Getty Images
Mirzapur 3 (source Getty Images)

Mirzapur 3 Record : ఓటీటీలో విశేష ఆదరణ దక్కించుకున్న వెబ్​సిరీసుల్లో మీర్జాపూర్ కూడా ఒకటి. రీసెంట్​గానే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ సీజన్​ 3 కూడా విడుదలైంది. విడుదలైన రోజు నుంచే ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రికార్డు వ్యూస్‌ సాధించింది. ప్రైమ్‌ వీడియోలో రిలీజైన వారాంతంలో అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న సిరీస్‌గా నిలిచింది. అంతేకాదు గతంలో వచ్చిన మీర్జాపూర్‌ 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది. 85 దేశాల్లో టాప్‌ 10 లిస్ట్‌లో నిలిచింది. యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లోనూ ఈ సిరీస్‌ ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. కాగా, ఈ సిరీస్​లో పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, శ్వేత త్రిపాఠి, మాధురీ యాదవ్‌, విజయ్‌ వర్మ తదితరులు నటించారు. గుర్మీత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యర్‌ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మీర్జాపూర్‌ సీజన్‌-4కు సంబంధించిన పనులు మొదలయ్యాయి. శరవేగంగా షూటింగ్​ పూర్తిచేసేందుకు సన్నద్ధం అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.