ETV Bharat / snippets

'విశ్వంభర' షూటింగ్​ - భారీ యాక్షన్ సీక్వెన్స్​లో చిరు

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 6:59 AM IST

source ETV Bharat
chiranjeevi (source ETV Bharat)

Mega 156 Chiranjeevi Vishwambhara : విశ్వంభర షూటింగ్​ను పరుగులు పెట్టిస్తున్నారు మెగాస్టార్​ చిరంజీవి. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. త్రిష, ఆషికారంగనాథ్, కునాల్​కపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్​గానే ఈ మూవీ హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. స్పెషల్​గా రెడీ చేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుపుతున్నారు. చిరుతో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. అలా ఆ సెట్‌లోనే ఈ వారం నుంచి ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది. దీనికి రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌ నేతృత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్ర సెట్​లో తాజాగా దర్శకుడు వి.వి.వినాయక్‌ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను మూవీటీమ్​ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్​తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ను వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.