ETV Bharat / snippets

రాయన్‌ సూపర్​ రికార్డ్​​ - ధనుశ్​ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 2:22 PM IST

source ETV Bharat
Dhanush Raayan Collections (source ETV Bharat)

Dhanush Raayan Collections : ధనుశ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాయన్‌. రీసెంట్​గా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం రికార్డుల దిశగా వెళ్తోంది. తాజాగా ఈ మూవీ ధనుశ్​ కెరీర్‌లోనే అత్యధిక వారాంతపు ఓపెనింగ్స్‌ను సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు వరల్డ్​వైడ్​గా రూ.75కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఈనేపథ్యంలోనే తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు ధనుశ్​. తమ సినిమా సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేశారు. "మా సినిమాకు విజయాన్ని అందించిన సినీ ప్రేక్షకులు, ఆత్మీయులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. నాపై అమితమైన ప్రేమ చూపించి, అండగా నిలబడుతున్న ఫ్యాన్స్​కు స్పెషల్ థ్యాంక్స్​. ఇప్పటివరకూ నేను అందుకున్న ది బెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇదే" అంటూ రాసుకొచ్చారు. సినిమాలో ధనుశ్​తో పాటు సందీప్‌ కిష‌న్‌, కాళిదాస్ జ‌య‌రామ్‌, దుషారా విజ‌య‌న్‌ కూడా నటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.