ETV Bharat / snippets

'భారతీయుడు 2' ట్రైలర్ డేట్ లాక్- రిలీజ్ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 12:25 PM IST

indian 2 trailer
indian 2 trailer (Source: ETV Bharat)

Indian 2 Trailer: లోకనాయకుడు కమల్​హాసన్​- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన భారతీయుడు- 2 ట్రైలర్ రిలీజ్​కు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్​ జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ఆదివారం అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్​ కూడా విడుదల చేశారు.'సేనాపతి వచ్చేస్తున్నాడు సిద్ధంగా ఉండండి' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ ట్రైలర్ తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్​ వీడియోలు, పాటలు విడుదలయ్యాయి. వీటన్నింటికీ ప్రేక్షకులనుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక 'భారతీయుడు'కి సీక్వెల్​గా తెరకెక్కిన ఈ మూవీ జులై 12న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో కమల్​హాసన్​తోపాటు సిద్ధార్థ్​, ఎస్​జే సూర్య, ప్రియ భవానీ, రకుల్, కాజల్​ తదితరులు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సుభాస్కరణ్ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్​పై ఈ సినిమాను నిర్మించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.