ETV Bharat / snippets

'అప్పుడు చాలా భయపడ్జా - వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేకపోయా'

source ETV Bharat
Janhvi Kapoor Hospitalized (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 2:05 PM IST

Janhvi Kapoor Hospitalized : హీరోయిన్ జాన్వీకపూర్‌ ఫుడ్​పాయిజన్‌ వల్ల ఇటీవల ఆస్పత్రిలో చేరి డిశ్చార్జ్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. "ఈ మధ్యకాలంలో వరుస షూటింగ్‌లు, ప్రమోషన్స్‌తో బిజీ అయ్యాను. గ్యాప్​ లేకుండా వరుసగా ప్రయాణాలు చేసి షూటింగ్‌లలో పాల్గొనడం వల్ల వీక్‌ అయ్యాను. అలా ఓ సాంగ్​ షూటింగ్‌లో పాల్గొనడం కోసం చెన్నై వెళ్లాను. అక్కడ చాలాసార్లు బయట తినాల్సి వచ్చింది. మొదట కడుపులో నొప్పిగా అనిపించింది. తర్వాత పూర్తిగా నీరసించిపోయా. వణుకు వచ్చింది. దీంతో హైదరాబాద్‌కు వచ్చే ముందు ఫ్లైట్‌ ఎక్కేటప్పుడు పక్షవాతానికి గురయ్యానా అని అనిపించింది. సాయం లేకుండా వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేకపోయాను. నడవడానికి కూడా ఓపిక లేదు. అందుకే హాస్పిటల్​కు వెళ్లి చికిత్స తీసుకున్నాను. అప్పుడే అన్నిటికన్నా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అర్థం చేసుకున్నాను. ఆసుపత్రిలో ఉన్నప్పుడు మళ్లీ డ్యాన్స్‌ చేయగలనా అని భయపడ్డాను. ఇప్పుడు పర్వాలేదు." అని చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.