ETV Bharat / snippets

సమంత యాక్షన్ సిరీస్​​ - 'సిటాడెల్'​ రిలీజ్ డేట్​ వచ్చేసిందోచ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 3:14 PM IST

source ANI
Amazon Prime Citadel Honey Bunny Release Date (source ANI)

Amazon Prime Citadel Honey Bunny Release Date : వరుణ్‌ధావన్‌ - సమంత కలిసి నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌(Citadel Honey Bunny). రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్​ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్‌ చాలా రోజులుగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. అయితే ఈ సిరిస్​ ఎప్పుడు వస్తుందా అని చాలా కాలం పాటు ఎదురుచూసిన సినీ ప్రియులు ఇప్పుడు దాన్ని మర్చిపోయారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడీ సిరీస్​ రిలీజ్ డేట్​ను ఖరారు చేసుకుంది. నవంబరు 7వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఈ సిరీస్‌లో ఇంకా సిమ్రన్‌, కేకే మేనన్‌, సోహమ్‌ మజుందార్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.