ETV Bharat / snippets

అఖిల్ 'ఏజెంట్'​కు మోక్షం - కానీ ఓ ట్విస్ట్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 6:59 PM IST

source ETV Bharat
Akhil Akkineni Agent Movie (source ETV Bharat)

Akhil Akkineni Agent Movie : అఖిల్‌అక్కినేని హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పైయాక్షన్‌ థ్రిల్లర్‌ ఏజెంట్‌. సాక్షి వైద్య హీరోయిన్​గా నటించింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్డర్​గా నిలిచింది. థియేటర్లలో విడుదలై చాలా కాలమే అయినా ఇప్పటివరకూ ఓటీటీలోనూ రిలీజ్ కాదు. వాయిదా పడుతూనే వస్తోందే తప్ప రిలీజ్​ డేట్​పై క్లారిటీ రావట్లేదు. అయితే రీసెంట్​గా ఏజెంట్‌ ఓటీటీ టాక్ విపరీతంగా నడిచింది. అయినా స్ట్రీమింగ్​పై స్పష్టత రాలేదు. ఈ క్రమంలో గోల్డ్‌మైన్స్‌ టీవీ ఛానల్‌ జులై 28న రాత్రి 8గంటలకు ఏజెంట్‌ను ప్రసారం చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా వదిలింది. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని ఫ్యాన్స్​ను డైరెక్ట్‌గా టీవీల్లో చూసే ఛాన్స్​ దక్కింది. అయితే ఇది కేవలం హిందీ వెర్షన్‌లోనే సందడి చేయనుంది. కాగా, సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.