ETV Bharat / snippets

కోలుకున్నాక అన్ని వివరాలు చెబుతాను : హెల్త్ అప్డేట్​ ఇచ్చిన ఆర్ నారాయణ మూర్తి

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 6:38 PM IST

Updated : Jul 17, 2024, 6:54 PM IST

Actor Director R Narayana Murthy Health Condition : ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్‌ నారాయణమూర్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కొద్ది నెలల క్రితం గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న అయన ఒంట్లో నలతగా ఉండడంతో తాజాగా వైద్యపరీక్షల కోసం నిమ్స్‌కు వెళ్లారు. దీంతో ఆయనకు ఏమైందో?అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే తన ఆరోగ్యంపై ఆర్​నారాయణమూర్తి స్పందించారు."నేను ఆరోగ్యంగానే ఉన్నా. నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను నిమ్స్ హాస్పిటల్​లో చికిత్స తీసుకుంటున్నాను. దేవుడి దయవల్ల బాగానే కోలుకుంటున్నాను. నేను కోల్కున్నాక నా ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతాను " అని పేర్కొన్నారు. కాగా, ఒకప్పుడు వరుస విప్లవ సినిమాలతో పీపుల్‌ స్టార్‌గా ఎదిగారు నారాయణమూర్తి. కథ, కథనం, దర్శకత్వం, సంగీతం, గానం అన్ని విభాగాల్లోనూ రాణించారు. అయితే గతకొంతకాలంగా ఆయన చిత్రాలేవి ఆడట్లేదు. చివరిసారిగా యూనివర్సీటీతో పలకరించిన ఆయన ప్రస్తుతం ఉక్కు సత్యాగ్రహం అనే సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Last Updated : Jul 17, 2024, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.