Maharashtra Assembly Election 2024 : మరో రెండు నెలల్లో మహాయుతి ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ ఊరుకోమని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవర్ అన్నారు. ఛత్రపతి శివాజీ ఆశయాలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముంబయిలోని ఘాట్కోపర్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఛత్రపతి విగ్రహం కూలిన ఘటనపై శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి ఛత్రపతిపై విశ్వాసం లేదని ఆరోపించారు. కార్యకర్తలు రెండు నెలలు కలిసిగట్టుగా ఉంటే ప్రభుత్వం మారుతుందని అన్నారు.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టేవరకు తగ్గేదేలే! : శరద్ పవార్
Published : Sep 1, 2024, 10:51 PM IST