ETV Bharat / snippets

సెక్యూరిటీ గార్డుకు జాక్​పాట్- లాటరీలో రూ.12 కోట్లు- ఐదేళ్ల నుంచి ట్రై చేస్తుంటే!

author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 10:08 PM IST

Vishu Lottery Result 2024
Vishu Lottery Result 2024 (ETV Bharat)

Vishu Lottery Result 2024 : కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విషు బంపర్ 2024 లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్నారు. పజవీడుకు చెందిన సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రిటైర్డ్ సీఆర్​పీఎఫ్​ విశ్వంభరన్​కు ఈ అదృష్టం వరించింది. తన టికెట్ నంబర్ VC 490987కి మొదటి బహుమతి వచ్చిందని తెలిసి షాక్ అయ్యానని విశ్వంభరన్ ఈటీవీ భారత్​తో తెలిపారు.

తాను గెలుపొందిన లాటరీ డబ్బులను దేవుడి బహుమతిగా వర్ణించారు. తనకు వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నట్లు విశ్వంభరన్​ తెలిపారు. అంతకుమించి తనకు వేరే ప్లాన్ లేదని చెప్పారు. రూ.500తో రెండు టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత ఐదేళ్లుగా టికెట్లు కొంటున్నట్లు తెలిపారు. ప్రతి నెలా టికెట్ల కోసం రూ.500 ఖర్చు చేస్తానని వెల్లడించారు. 20 టికెట్లు కచ్చితంగా కొనుగోలు చేస్తానని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.