ETV Bharat / entertainment

1 మిలియన్ దిశగా 'మత్తు వదలరా 2' కలెక్షన్స్​ - యూఎస్​ఏ మార్కెట్​లోనూ జోరు! - Mathuvadalara 2 USA Collections - MATHUVADALARA 2 USA COLLECTIONS

Mathuvadalara 2 Collections : నాన్ స్టాప్ కామెడీతో ప్రేక్షకులకు మంచి కాలక్షేప వినోదాన్ని అందిస్తున్న 'మత్తు వదలరా 2' బాక్సాఫీస్ ముందు తన వసూళ్లను కొనసాగిస్తోంది. యూఎస్​ఏ మార్కెట్​లోనూ జోరు చూపిస్తోంది. ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందంటే?

source ETV Bharat
Mathuvadalara 2 Collections (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2024, 12:00 PM IST

Sri Simha Mathuvadalara 2 Collections : సత్య, సత్య, సత్య - గత ఐదారు రోజులుగా టాలీవుడ్​ బాక్సాఫీస్​ ముందు ఈ పేరు మార్మోగిపోతోంది. అందుకు కారణం 'మత్తు వదలరా 2'. ఈ చిత్రాన్ని సత్య తన కామెడీ టైమింగ్​, పంచ్​లతో ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. అలా ఈ మూవీ సక్సెస్​కు ప్రధాన కారణంగా మారడంతో అందరూ ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు.

సత్య నాన్ స్టాప్ కామెడీతో ప్రేక్షకులకు మంచి కాలక్షేప వినోదాన్ని అందించడం వల్ల 'మత్తు వదలరా 2' ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతోంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను కూడా అందుకుంటోంది. మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్స్ అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే లాభాల్లోకి కూడా అడుగుపెట్టేసింది. యూఎస్ మార్కెట్​లోనూ కూడా అదిరే వసూళ్లను నమోదు చేస్తోంది. వీక్ డేస్​లోనూ స్ట్రాంగ్ హోల్డ్​ను కనబరుస్తూ ప్రదర్శితమవుతోంది. అలా ఈ 'మత్తు వదలరా 2' యూఎస్​లో 800కే డాలర్స్​ గ్రాస్ మార్క్​ను టచ్​ చేసింది. ప్రస్తుతం 1 మిలియన్​ క్లబ్​ దిశగా దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది.

Mathuvadalara 2 Cast and Crew : కాగా, ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం మరో బలం. సినిమాలో కీరవాణి తనయుడు శ్రీసింహా కూడా హుషారుగా నటించారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హీ-టీమ్‌లో ఓ సభ్యురాలిగా కనిపిస్తూనే కామెడీ పండించింది. యాక్షన్ సీన్స్​లోనూ కనువిందు చేసింది. రోహిణి, సునీల్, వెన్నెల కిశోర్, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాంకేతికంగా కూడా సినిమా ఉన్నతంగా ఉంది. కాల భైరవ సంగీతం చిత్రానికి ప్రధాన బలం. కెమెరా, ఎడిటింగ్ విభాగాలు కూడా చక్కటి పనితీరును కనబరిచాయి. దర్శకుడు రితేష్ రాణా మార్క్ సంభాషణలు నవ్విస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఎడిటింగ్‌ బాధ్యతలు కార్తిక్‌ శ్రీనివాస్ చూసుకున్నారు. సురేశ్‌ సరంగం సినిమాటోగ్రఫీ అందించారు.

'ఆ మూడు రోజులు నీళ్లు మాత్రమే తాగి' - మత్తు వదలరా 2 సత్య గురించి ఆసక్తికర విషయాలు - Mathu Vadalara 2 Comedian Satya

'మత్తు వదలరా 2' రివ్యూ - ఈ క్రైమ్, కామెడీ OTTలోకి ఎప్పుడంటే? - Mathu Vadalara 2 Review

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.