ETV Bharat / spiritual

'రావి ఆకుపై ఇలా రాసి పెడితే అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయి' - work completion tips in telugu

author img

By ETV Bharat Features Team

Published : Sep 18, 2024, 12:09 PM IST

Work Complete Tips And Tricks in Telugu: పనుల్లో ఆటంకాలు తొలగిపోయి.. అనుకున్న పనులన్నీ జరగడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ప్రముఖ జ్యోతిష్య పండితులు మాచిరాజు కిరణ్ కుమార్ సమాధానం చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

work complete tips and tricks in telugu
work complete tips and tricks in telugu (ETV Bharat)

Work Complete Tips And Tricks in Telugu: జ్యోతిష్య శాస్త్రాన్ని చాలా మంది నమ్ముతారు. తాము అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలని దేవుళ్లను పూజిస్తుంటారు. ప్రతి పనీ ముహూర్తం చూసి మొదలు పెడుతుంటారు. అయినా కొన్ని పనులకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. అయితే.. శాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులు పాటిస్తే ఎలాంటి ఆటంకాలూ లేకుండా పనులు పూర్తవుతాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. మరి ఆ విధానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • శనివారం మినహా ఏదైనా రోజు రావి ఆకును ఇంటికి తెచ్చుకుని గంగాజలం లేదా మంచినీటితో కడగాలి. దానిపైన గంధంతో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాసి పూజ స్థలంలో ఉంచాలి. ప్రతిరోజూ దానికి ధూపం వేయాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఆటంకాలు తొలగిపోతాయని మాచిరాజు కిరణ్ కుమార్ అంటున్నారు.
  • పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఇంటి ఇల్లాలు పిడికెడు నల్ల మినుములతో.. ఆ బయలు దేరే వ్యక్తికి దిష్టి తీసి వాటిని దూరంగా విసిరేయాలట. ఇలా చేసి బయటకు వెళితే అనుకున్న పనులు పూర్తవుతాయని చెబుతున్నారు.
  • ఇంకా మీ ఇంట్లోని పూజగదిలో ఎప్పుడూ పీచుతో ఉన్న కొబ్బరికాయ ఉండేలా చూసుకోవాలట. కొబ్బరికాయ గణపతి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు పూర్తయ్యేలా చేస్తుందని పరిహార శాస్త్రం చెబుతోందని తెలిపారు.
  • అదే విధంగా తెల్ల కాగితంపై ఎరుపు రంగుతో త్రిభుజం గీసి దాని మధ్యలో శ్రీ అనే అక్షరం కూడా ఎరుపు రంగుతో రాయాలి. తర్వాత ఆ కాగితం దగ్గర ఉంచుకుని బయటకు వెళ్లండి. ఇలా చేస్తే పనులు పూర్తవుతాయట. పని పూర్తయ్యాక ఆ కాగితాన్ని గుడిలో పెట్టి తిరిగి రావాలని చెబుతున్నారు.
  • గణపతిని గరికతో పూజించి ఆ తర్వాత దానిని మీ వద్ద పెట్టుకుని బయటకు వెళ్లాలి. ఇలా చేస్తే వినాయకుడి అనుగ్రహంతో పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు.
  • ఆంజనేయస్వామికి మీరు బయటకు వెళ్లేటప్పుడు 9 ప్రదక్షిణలు చేసి.. దేవాలయంలోనే బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి వెళితే అనుగ్రహం కలిగి పనులన్నీ త్వరగా పూర్తవుతాయట.
  • మీరు ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లినప్పుడు ఒక కొబ్బరికాయకు బొట్టు పొట్టి.. మీతో పాటే తీసుకుని బయటకు వెళ్లండి. ఆ తర్వాత పని దిగ్విజయంగా పూర్తయ్యాక ఇంటికి వచ్చేటప్పుడు దక్షిణతో పాటు కొబ్బరికాయను వినాయకుడి గుడిలో ఇవ్వడం వల్ల పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు.
  • గణపతి స్వరూపాల్లో ఒక గణపతి చాలా శక్తిమంతమైనదని.. దీనికి కుంకుమ బొట్టు పెట్టి బయటకు వెళితే కార్య సిద్ధి జరుగుతుందని చెబుతున్నారు.
  • ఇంకా అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి కావాలంటే... బయటకు వెళ్లేముందు ఇంటి గుమ్మం ముందు ఆవ నూనెతో దీపం పెట్టండి. అందులో ఓ లవంగం పెట్టి బయటకు వెళ్లాలి. ఇలా చేయడం వల్ల శని, శుక్రుడు గ్రహాల బలం వల్ల కష్టమైన పనులు కూడా పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

పూజ గదిలోని ఈ వస్తువులను కింద పెడుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా? - Vastu Tips Telugu

మీ మెయిన్ డోర్​కు ఎదురుగా లిఫ్ట్ ఉందా? - వాస్తు ప్రకారం జరిగేది ఇదే! - Vastu Tips for Home in Telugu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.