ETV Bharat / snippets

జమ్ముకశ్మీర్​లో మరో ఎన్​కౌంటర్​- అమరులైన ఇద్దరు జవాన్లు- మరో వ్యక్తి కూడా!

Jammu And Kashmir Terror Attack
Jammu And Kashmir Terror Attack (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 8:47 PM IST

Jammu Kashmir Terror Attack : జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతుల సంఖ్య ముగ్గురికి చేరింది. శనివారం ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులవ్వగా, గాయపడిన అబ్దుల్ రషీద్ దార్ అనే పౌరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరణించిన ఆర్మీ సిబ్బందిని హవల్దార్ దీపక్ కుమార్ యాదవ్,లాన్స్ నాయక్ ప్రవీణ్ శర్మగా గుర్తించారు.

కోకెర్‌నాగ్ ప్రాంతంలోని అహ్లాన్ గగర్‌మండు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆర్మీ అధికారులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు ఆర్మీ సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదులు పారిపోయారని, వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.