ETV Bharat / snippets

భారత్‌లో తొలి మంకీపాక్స్‌ కేసు నమోదు- ఆందోళన అవసరం లేదన్న కేంద్రం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 9:24 PM IST

Updated : Sep 9, 2024, 9:33 PM IST

First Monkeypox Case In India
First Monkeypox Case In India (ETV Bharat)

First Monkeypox Case In India : భారత్‌లో తొలి మంకీపాక్స్‌ కేసు నిర్ధరణ అయ్యింది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలను పరీక్షించగా, అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్‌-2 రకంగా తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించి ఆత్యయిక స్థితికి కారణమైన క్లేడ్‌-1 కాదని కేంద్రం తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. బాధితుడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపింది.

విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ఓ యువకుడిలో మంకీపాక్స్‌ లక్షణాలు గుర్తించారు. దీంతో వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి నమూనాలను లేబొరేటరీకి పంపించారు. అది మంకీపాక్స్‌ అని నిర్ధరణ అయ్యింది. అయితే, గతంలో భారత్‌లో వెలుగు చూసిన (జులై 2022 నుంచి) 30 కేసుల మాదిరిగానే ఈ కేసు ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో ఇటీవల ప్రకటించిన ఆందోళనకర క్లేడ్‌-1 రకం కాదని స్పష్టం చేసింది.

Last Updated : Sep 9, 2024, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.