ETV Bharat / snippets

ప్రైవేట్​ ఉద్యోగాల రిజర్వేషన్లపై ప్రభుత్వం వెనుకడుగు- తాత్కాలికంగా నిలిపివేత!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 10:02 PM IST

Updated : Jul 17, 2024, 10:14 PM IST

karnataka reservation bill
karnataka reservation bill (ETV Bharat)

Karnataka Reservation Bill Hold : కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. పరిశ్రమవర్గాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడం వల్ల బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. సోమవారం ఈ బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావించింది. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దీనిపై రానున్న రోజుల్లో సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

అంతకుముందు కర్ణాటక నూతన పరిశ్రమల బిల్లు యోచనపై నేషనల్‌ అసోసియేషన్ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌(నాస్కామ్‌) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. కర్ణాటక ప్రభుత్వ యోచనను నిరసిస్తూ నోట్‌ విడుదల చేసింది. కర్ణాటక అభివృద్ధిలో టెక్‌సంస్థలది కీలకపాత్రని, ఆంక్షలు విధిస్తే కంపెనీలు తరలివెళ్లే ప్రమాదం ఉందని చెప్పింది. కర్ణాటక యోచనపై పరిశ్రమల యజమానులతో చర్చిస్తామని వివరించింది.

Last Updated : Jul 17, 2024, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.