ETV Bharat / snippets

మహిళా ఉద్యోగుల నెలసరి సెలవులపై కేంద్రానికి సుప్రీం ఆదేశాలు- ఏం చెప్పిందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 1:55 PM IST

Supreme Court On Menstrual Leave
Supreme Court On Menstrual Leave (Getty Images)

Supreme Court On Menstrual Leave : మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రాలు, ఇతర భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరిపి నెలసరి సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. నెలసరి సెలవుల మోడల్ పాలసీ అనేది కోర్టులు పరిశీలించాల్సిన అంశం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

నెలసరి సెలవులు ఎక్కువ మంది మహిళలను శ్రామిక శక్తిలో భాగం చేసేందుకు ఎలా ఉపయోగపడతాయని పిటిషనర్​ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నెలసరి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల మహిళలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. మహిళలకు నెలసరి సెలవుల మంజూరుపై కోర్టు నిర్ణయం వల్ల వారిపై ప్రతికూల ప్రభావం పడొచ్చని పేర్కొంది. సెలవులను మంజూరును తప్పనిసరి చేస్తే యజమానులు మహిళలను ఉద్యోగాల్లో నియమించుకోకపోవచ్చని అభిప్రాయపడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.