ETV Bharat / snippets

'ఓసారి నా స్థానంలో కూర్చోండి - ఎంత ఒత్తిడి ఉంటుందో మీకే తెలుస్తుంది' - న్యాయవాదులపై CJI తీవ్ర అసహనం

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 1:27 PM IST

CJI DY Chandrachud
CJI DY Chandrachud (ANI)

CJI Chandrachud About Work Pressure Of Judges : దేశంలోని కోర్టులు, న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఒక్కరోజు తన స్థానంలో కూర్చుంటే, మరోసారి జీవితంలో ఆ స్థానానికి రాకుండా పారిపోతారని స్పష్టంచేశారు. ముంబయి చెంబూర్‌ కాలేజీలో విద్యార్థులకు బురఖా, హిజాబ్‌ను రద్దుచేసిన వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ విచారణకు వచ్చినపుడు జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రతి న్యాయవాది తమ కేసునే మొదట విచారణ జరపాలంటూ కోరడం పట్ల సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. అంతా తమ పిటిషన్‌ ముందుగా విచారణకు రావాలని కోరుతున్నారని, కానీ తమపై ఉన్న ఒత్తిడిని మాత్రం అర్థం చేసుకోవడంలేదని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. ప్రతి ఒక్క పిటిషన్‌పై తాము విచారణ జరుపుతామని, అందుకు ఒక తేదీ ఇస్తామన్నారు. న్యాయమూర్తులను, కోర్టును శాసించే పరిస్థితులు సరికాదని సీజేఐ స్పష్టంచేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.