SC Ruling On Sexual Harassment Case : ఫిర్యాదుదారులకు, నిందితులకు మధ్య రాజీ కుదిరినంత మాత్రాన లైంగిక వేధింపుల కేసును కొట్టేయడానికి వీల్లేదని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. ఓ లైంగికవేధింపుల కేసుపై రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజస్థాన్‌లోని గంగాపుర్‌లోని ఓపాఠశాల ఉపాధ్యాయుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ బాలిక ఫిర్యాదు చేసింది. దీనితో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కానీతరువాత బాలిక కుటుంబం, నిందుతుడితో రాజీ పడింది. సదరు ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు వద్దని కోరింది. దీనిని ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో నిందితుడు హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టు ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పును సామాజిక కార్యకర్త ఒకరు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, కేసు పూర్వాపరాలు పరిశీలించిన సుప్రీంకోర్ట్ - హైకోర్టు తీర్పును రద్దు చేసింది. ఆ కేసుపై తిరిగి విచారణ జరపాలని ఆదేశించింది.
రాజీపడ్డారని లైంగిక వేధింపుల కేసును కొట్టివేయకూడదు: సుప్రీంకోర్ట్
Published : 14 hours ago