ETV Bharat / snippets

'సినిమాల్లో ఇకపై అలాంటి సీన్స్ ఉండకూడదు'- సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 12:43 PM IST

SC New Guidelines On Films
SC New Guidelines On Films (Getty Images, ANI)

SC New Guidelines On Films : సినిమాలు, దృశ్య మాధ్యమాల్లో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. దివ్యాంగుడు, స్పాస్టిక్ వంటి పదాలు వారిని సామాజిక వివక్షకు గురయ్యేలా చేస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సినిమా స్క్రీనింగ్​కు అనుమతించే ముందు సర్టిఫికేట్ ఇచ్చే సీబీఎఫ్​సీ నిపుణుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంది. దివ్యాంగులపై వాస్తవాలను చిత్రీకరించడానికి దృశ్య మీడియా కృషి చేయాలని తెలిపింది. అలాగే దివ్యాంగుల సవాళ్లను మాత్రమే కాకుండా వారి విజయాలు, ప్రతిభ, సమాజానికి చేసిన సేవను చూపించాలని అభిప్రాయపడింది. బాలీవుడ్ సినిమా 'ఆంఖ్‌ మిచోలీ'లో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని నిపున్ మల్హోత్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.