ETV Bharat / offbeat

'మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు - వారికి రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చా?' - న్యాయ నిపుణుల సమాధానం ఇదే! - Legal Advice on Property Dispute - LEGAL ADVICE ON PROPERTY DISPUTE

కొంతమంది బిడ్డలు ప్రాపర్టీనంతా తమ పేరున రాయించుకున్న తర్వాత.. తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉంటారు. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో తాము రాసిచ్చిన ఆస్తిని.. తల్లిదండ్రులు వెనక్కి తీసుకోగలరా? చట్టం ఏం చెబుతోంది? అన్నది ఇప్పుడు చూద్దాం.

Legal Advice
Legal Advice on Property Rights (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2024, 12:18 PM IST

Legal Advice on Property Rights : కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మీద మమకారంతో.. అలాగే వారు చివరి వరకు తమ బాగోగులు చూస్తారనే భరోసాతో ముందే ఆస్తి మొత్తం వారి పేరుమీద రాసిస్తుంటారు. ఆస్తులు మాత్రమే కాకుండా.. తమ వద్ద ఉన్న బంగారం, డబ్బులు అన్నీ సమానంగా పంచేస్తుంటారు. కానీ.. కొందరు పిల్లలు ఆస్తి పంపకాలు పూర్తైన తర్వాత తల్లిదండ్రుల​ మంచీచెడు చూడడం మానేస్తుంటారు. దీంతో అందరూ ఉన్న కూడా వృద్ధాప్యంలో ఆ దంపతులు అనాథలుగా మిగిలిపోతారు.

దయతో పిల్లల్ని తమ బాగోగులు చూడమని అడిగితే.. బాధ్యతలు తీసుకోవడం అటుంచితే.. వృద్ధాశ్రమంలో చేరమని ఉచిత సలహాలు ఇస్తుంటారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఎంతో మంది వృద్ధ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతుంటారు.

ఇలాంటి పరిస్థితే ఓ వృద్ధ జంటకు ఎదురైంది. ఆస్తి పంపకాల తర్వాత పిల్లలు వారిని గురించి పట్టించుకోవడం మానేశారు. అప్పటి నుంచి పెన్షన్‌తోనే జీవితం గడుపుతున్నారు. వారిలో తండ్రి అనారోగ్యంతో మంచాన పడ్డారు. దీంతో మెడిసిన్, వైద్యం ఖర్చులు పెరిగిపోయాయి. ఈ అవసరాలకు పెన్షన్​ డబ్బులు ఎటూ సరిపోవడం లేదని.. తమ ఆస్తి వెనక్కి తీసుకుంటేనైనా వారికి బుద్ధి వస్తుందేమోనని, ఆ అవకాశం ఉందా? అని న్యాయ నిపుణుల సలహా కోరుతున్నారు. మరి.. ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది 'జి. వరలక్ష్మి' ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలుసుకుందాం.

ఇది చాలా బాధకరం..

తల్లిదండ్రులకు.. కన్నబిడ్డల మీద ప్రేమ, మమకారం, అప్యాయత అనేవి చివరి వరకు ఉంటాయి. కానీ.. మీరు ఆస్తి రాసిస్తే తమ బాగోగులు చూస్తారనే భరోసాతో ప్రాపర్టీనంతా ముందుగానే బిడ్డలకి పంచి ఇచ్చి పొరపాటు చేశారు. ప్రస్తుత జనరేషన్​లో ఉన్న కొంతమంది తమకున్న బాధ్యతలు వేరనీ, కన్నవాళ్ల పోషణ భారమనీ భావిస్తున్నారు. ఇది చాలా విచారకరమైన విషయమని న్యాయవాది వరలక్ష్మి చెబుతున్నారు.

"ఇలా తల్లిదండ్రుల మంచిచెడులు చూడని వారి కోసం.. ప్రభుత్వం సీనియర్‌ 'సిటిజన్స్‌ యాక్ట్‌-2007' తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్న పేరెంట్స్​ని పోషించే బాధ్యత పిల్లలదే. ఈ యాక్ట్‌ బిడ్డలు ఆస్తులకోసం కన్నవాళ్లను హింసించకుండా కాపాడుతుంది."-జి.వరలక్ష్మి, న్యాయవాది

అదే విధంగా పిల్లల చేతిలో బాధలు పడుతున్నా, ఆర్థికంగా, సామాజికంగా నిరాదరణకు గురవుతున్నా వృద్ధుల సంరక్షణ చట్టం కింద ఏర్పాటైన న్యాయస్థానాన్ని రక్షణ కల్పించమని కోరవచ్చు.

ఈ యాక్ట్‌లోని సెక్షన్‌ 23 ప్రకారం.. వృద్ధాప్యంలో తమ బాగోగులు చూడాలనే నియమంతో బిడ్డలకి ఆస్తిని ఇష్టపూర్వకంగా రాసిచ్చినా లేదా వాళ్లే బలవంతంగా రాయించుకుని అనుభవిస్తున్నా అది జరగనప్పుడు దాన్ని రద్దుచేయమని పేరెంట్స్​ కోర్టుని కోరవచ్చు. అంటే.. తమని చూడాలన్న ఒప్పందం మీద ఇచ్చిన ఆస్తుల్ని పేరెంట్స్​ తిరిగి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది. అయితే.. ఇది యాక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత జరిగిన లావాదేవీలకే వర్తిస్తుంది. కాబట్టి ముందు ఒక లాయర్‌ని కలిసి మీ పరిస్థితిని తెలియజేయండి. తప్పకుండా న్యాయం జరుగుతుందని సలహా ఇస్తున్నారు న్యాయవాది జి. వరలక్ష్మి.

Note: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. న్యాయవాదుల సలహాలు, చట్ట ప్రకారం పాటించాల్సిన సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత న్యాయవాది సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

పాపం.. భర్త చనిపోయాడు - అత్తగారు రాసిచ్చిన భూమిని అడ్డుకుంటున్నారు! - న్యాయ నిపుణుల సమాధానం ఇదే

'మా నాన్నకు ఇద్దరు భార్యలు - మా అమ్మ ఆస్తిపై నాకు హక్కు లేదంటున్నారు' - ఏం చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.