ETV Bharat / snippets

దిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్​కు భారీ ఊరట- దాదాపు రెండేళ్ల తర్వాత బెయిల్

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Satyendar Jain Bail
Satyendar Jain Bail (ANI)

Satyendar Jain Bail : దిల్లీ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత సత్యేంద్ర జైన్‌కు దిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో తిహాడ్‌ జైలులో విచారణ ఖైదీగా ఉన్న ఆయనకు దాదాపు రెండేళ్ల తర్వాత బెయిల్‌ ఇచ్చింది. విచారణలో జాప్యం కారణంగా 18 నెలలుగా సత్యేంద్ర జైన్‌ జైలు జీవితం గడిపినట్లు తెలిపిన న్యాయస్థానం, నిందితుడికి బెయిల్‌ పొందే అర్హత ఉందని తెలిపింది.

నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై సత్యేంద్ర జైన్‌ను 2022 మే 30న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు- షెల్‌ కంపెనీల నుంచి సుమారు 4.81 కోట్ల రూపాయలు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన FIR ఆధారంగా ఈడీ ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.