Ricky Kej Guinness World Record : ప్రముఖ సంగీత స్వరకర్త, మూడు గ్రామీ అవార్డుల విజేత రికీకేజ్, ఒడిశాకు చెందిన కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కేఐఎస్‌ఎస్)తో కలిసి 'లార్జెస్ట్ సింగింగ్ లెసన్' పేరిట భారత జాతీయగీతం 'జన గణ మన' గానంతో గిన్నిస్ రికార్డు సాధించారు. గతేడాది లండన్‌లోనూ అతిపెద్ద సింఫనీ ఆర్కెస్ట్రాతో 'జన గణ మన' గానం ద్వారా ఈయన గుర్తింపు పొందారు. ఈసారి ఒడిశాకు చెందిన 14,000 మంది గిరిజన విద్యార్థులతో కలిసి సరికొత్త రికార్డు స్థాపించారు. ‘కళింగ’ సంస్థకు చెందిన డాక్టర్ అచ్యుత సమంతతో కలిసి రికీకేజ్ మీడియాతో మాట్లాడుతూ, గత నెల చిత్రీకరించిన ఈ రికార్డింగ్‌ను ఆగస్టు 14న అన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తామన్నారు. వేణుగాన విద్వాంసుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వంటి పలు సంగీత దిగ్గజాల ప్రదర్శనను కూడా ఇందులో చూడవచ్చు.
'జన గణ మన' గానంతో గిన్నిస్ రికార్డు
Published : Aug 11, 2024, 6:48 AM IST