Rajasthan Bus Accident : రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికి గాయాలయ్యాయి. బస్సు ఫ్లై ఓవర్ గోడను ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రైవేట్ బస్సు సలాసర్ నుంచి లక్ష్మణ్‌గఢ్‌కు వెళ్తున్నప్పుడు, మలుపు తిరిగే సమయంలో లక్ష్మణ్‌గఢ్‌లోని ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది అని చెప్పారు. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పడం వల్ల ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్ష్మణ్‌గఢ్, సికార్‌లోని ఆస్పత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు
ఫ్లైఓవర్ గోడను ఢీ కొట్టి బస్సు బోల్తా - 12 మంది మృతి, 40 మందికిపైగా గాయాలు
Published : Oct 29, 2024, 6:28 PM IST