6000 Special Trains This Festive Season : పండగల వేళ ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికుల సౌకర్యార్థం భారత రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దసరా, దీపావళి, ఛఠ్ పూజలకు సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం దాదాపు 6000 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, "పండగల కోసం గతేడాది 4,429 రైళ్లను నడిపాం. ఈ సారి ఏకంగా 5,975 రైళ్లను కేటాయించాం. మరో 108 రైళ్లకు సాధారణ కోచ్‌లు పెంచాం. దీనితో 12,500 కోచ్‌లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. పండగల వేళ కోటి మందికి పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడానికి ఇవి సహాయపడనున్నాయి" అని పేర్కొన్నారు.
పండగల వేళ 6000 ప్రత్యేక రైళ్లు - రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
Published : Sep 28, 2024, 8:43 AM IST