ETV Bharat / snippets

రాహుల్ గాంధీ ఇంటి వద్ద హై సెక్యూరిటీ- నిఘా వర్గాల హెచ్చరికతోనే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 7:01 AM IST

Rahul Gandhi Security
Rahul Gandhi Security (ANI)

Rahul Gandhi Security : మితవాద గ్రూపు దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నివాసం వద్ద దిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. స్థానిక పోలీసులతో పాటు ఒక ప్లాటూన్‌ పారామిలిటరీ బలగాలను ఆయన నివాసం చుట్టూ మోహరించారు. లోక్‌సభలో సోమవారం ప్రసంగించిన రాహుల్‌గాంధీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ పార్టీ శ్రేణులు రాహుల్‌ నివాసం వద్ద ఆందోళనకు దిగే ప్రమాదం ఉందన్న సమాచారం మేరకు భద్రతను పెంచారు. రాహుల్‌ నివాసం చుట్టూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులకు సూచించారు. జెడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన రాహుల్‌కు సీఆర్​పీఎఫ్ బృందాలు భద్రత కల్పిస్తున్నాయి. బీజేపీని ఉద్దేశించి రాహుల్‌ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు బుధవారం ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారి అడ్డుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.