ETV Bharat / snippets

హరియాణాలో కాంగ్రెస్​ అభ్యర్థులుగా వినేశ్​, బజ్​రంగ్ పోటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 1:37 PM IST

Rahul Gandhi meets Vinesh Phogat
Rahul Gandhi meets Vinesh Phogat (ANI, Getty Images)

Rahul Gandhi meets Vinesh Phogat : స్టార్ రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారని సమాచారం. దిల్లీలో బుధవారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​తో వారిద్దరూ భేటీ అయిన అనంతరం సంబంధిత వర్గాలు ఈమేరకు వెల్లడించాయి.

ఇక హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై చర్చలు జరిపి 66 మందిని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పునియా, వినేశ్‌ను రాహుల్‌ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ విషయంపై గురువారం నాటికి స్పష్టత వస్తుందని కాంగ్రెస్ పార్టీ హరియాణా ఇన్​ఛార్జ్ దీపక్ బబారియా చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.