Quarry Collapse In Mizoram : మిజోరాం రాజధాని అయిజోల్ శివారు ప్రాంతంలో భారీ వర్షానికి స్టోన్ క్వారీ కూలిపోవడంతో 17 మంది మృతి చెందగా ఆరు నుంచి ఏడుగురు గల్లంతయ్యారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆ రాష్ట్ర డీజీపీ అనిల్ శుక్లా తెలిపారు. స్టోన్ క్వారీలో మృతి చెందిన కుటుంబాలకు మిజోరం సీఎం లాల్‌దుహోమా నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
మరోవైపు భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడుతుండటం వల్ల ఐజ్వాల్‌లో పాఠశాలలను మూసివేశారు. ఉద్యోగులు కూడా ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవాలని అధికారులు సూచించారు. జాతీయ రహదారి 6పై కొండచరియలు విరిగిపడటం వల్ల ఐజ్వాల్‌కు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. మరో రెండ్రోజులు అసోం సహా తదితర ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది.