ETV Bharat / snippets

వయనాడ్​లో​ బుధవారం ప్రియాంక నామినేషన్​- సోనియా, రాహుల్​ హాజరు

Priyanka Gandhi Nomination
Priyanka Gandhi Nomination (Source: Office of Priyanka Gandhi Vadra)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2024, 4:23 PM IST

Priyanka Gandhi Nomination : కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానం ఉప ఎన్నికకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్​కు ముందు ప్రియాంక గాంధీ పార్టీ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

2024 లోక్​సభ ఎన్నికల్లో వయనాడ్​, ఉత్తర్​ప్రదేశ్​లోని రాయ్​బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. రాయ్​బరేలీ సీటును తన వద్దే ఉంచుకుని, వయనాడ్​ ఎంపీగా రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలో ప్రియాంక గాంధీని యూడీఎఫ్​ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఝార్ఖండ్ అసెంబ్లీకి తొలి దశ పోలింగ్‌తో పాటు వయనాడ్ పార్లమెంట్ స్థానం, 47 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.