ETV Bharat / snippets

అరుణాచల్​ సీఎంగా పెమా ఖండూ- మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 6:47 PM IST

arunachal pradesh cm
arunachal pradesh cm (ANI)

Arunachal Pradesh CM : అరుణాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు పెమా ఖండూ. ఈ మేరకు బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన్ను తమ నేతగా మరోసారి ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ఈ భేటీకి కేంద్ర పర్యవేక్షకులుగా రవిశంకర్ ప్రసాద్​, తరుణ్ ఛుగ్​ హాజరయ్యారు. కాగా గురువారం ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు పెమా ఖండూ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాల్లో విజయం సాధించింది. నేనషల్​ పీపుల్స్​ పార్టీ(ఎన్​పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్​సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో అరుణాచల్​ ప్రదేశ్​ సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.