మున్నేరు వరద బాధితులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన మార్గదర్శి సంస్థ - MARGADARSI CHIT FUND PRIVATE - MARGADARSI CHIT FUND PRIVATE
🎬 Watch Now: Feature Video
Published : Oct 5, 2024, 4:29 PM IST
Margadarsi Distributed New Clothes : మున్నేరు వరద విలయంతో పీకల్లోతు కష్టాల్లో ఉండి పండుగ కళ తప్పిన మున్నేరు వరద బాధితులకు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేమున్నామంటూ బాసటగా నిలిచింది. ఖమ్మం నగరం, ఖమ్మం గ్రామీణం మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం మార్గదర్శి సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ దుస్తులు పంపిణీ చేశారు. ఖమ్మం నగరంలోని పద్మావతి నగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, పంపింగ్ వెల్ రోడ్డు, పెద్దమ్మతల్లి గుడి రోడ్డు ప్రాంతాల్లోని ప్రజలకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. మొత్తం రూ.18 లక్షల విలువైన నూతన వస్త్రాలను వరద బాధితులకు అందజేశారు.
ఖమ్మం మార్గదర్శి ప్రైవేటు లిమిటెడ్ మేనేజర్ హనుమంతరావు, ఈనాడు ఖమ్మం యూనిట్ ఇంఛార్జి కె. వీరబాబు ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది బాధితులకు నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం ఖమ్మం గ్రామీణం మండలంలోని దానవాయిగూడెం, కరుణగిరి, జలగం నగర్ ప్రాంతాల్లోని వరద ప్రభావిత కాలనీలకు వెళ్లి దుస్తులు పంపిణీ చేశారు. పిల్లలకు నూతన వస్త్రాలను అందించారు. మున్నేరు వరదల్లో సర్వం కోల్పోయి ప్రస్తుతం బతుకమ్మ, దసరా పండుగ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న తమకు మార్గదర్శి చిట్ ఫండ్ అండగా నిలిచిందని బాధితులు అభిప్రాయపడ్డారు. బతుకమ్మ పండుగ కానుకగా తమకు నూతన వస్త్రాలు అందజేసిన మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్కు కృతజ్ఞతలు తెలిపారు.