Lok Sabha Speaker Election : లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొన్న వేళ బీజేపీ సంప్రదింపులను ముమ్మరం చేసింది. ఎన్డీఏలోని తమ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. ఓం బిర్లాను మరోసారి స్పీకర్‌గా ఎన్నుకునే అంశం పరిశీలనలో ఉన్నప్పటికీ విపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేలా సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభలో తమ కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉన్నందున ప్రతిపక్షాల్లో రాజకీయ లబ్ధి కలిగించే అవకాశం ఇవ్వరాదని బీజేపీ భావిస్తోంది. ఎన్డీఏ మిత్రపక్షాలకు మరో కీలకమైన పార్టీకి ఆపదవి ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందా లేదా అనేది మంగళవారం స్పష్టతరానుంది. స్పీకర్ అభ్యర్థి విషయమై బీజేపీ అగ్రనాయకత్వం తమను సంప్రదించిందని ఎన్డీఏలోని రెండు భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలు పేర్కొన్నారు. అయితే చర్చల వివరాలను, ప్రస్తావనకు వచ్చిన ఎంపీల పేర్లను వెల్లడించలేదు. ఎన్డీఏ వైఖరిని ఆధారంగానే తాము స్పీకర్ పదవికి పోటీ పడాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పలువురు ప్రతిపక్ష నేతలు చెప్పారు.
లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ- ఓం బిర్లాకే మరోసారి ఛాన్స్! వారితో బీజేపీ సంప్రదింపులు
Published : Jun 25, 2024, 6:48 AM IST