ETV Bharat / snippets

'ఆదివారంలోపు మెడికో కేసు తేల్చకుంటే సీబీఐకి అప్పగిస్తా'- బంగాల్​ పోలీసులకు మమత డెడ్​లైన్

Kolkata Doctor Case To CBI
Kolkata Doctor Case To CBI (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 3:02 PM IST

Updated : Aug 12, 2024, 7:07 PM IST

Kolkata Doctor Case To CBI : కోల్​కతా డాక్టర్ హత్యాచార ఘటనపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఆదివారం నాటికి కేసును ఛేదించడంలో పోలీసులు విఫలమైతే, దర్యాప్తును సిబీఐకి అప్పగిస్తామని తెలిపారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని కూడా తాను కోరుకుంటున్నానన్నారు. మరణించిన వైద్యురాలి నివాసాన్ని సందర్శించిన తర్వాత మమతా బెనర్జీ స్థానిక విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు.

బంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల వైద్యులు సోమవారం నిరవధిక సమ్మెకు దిగారు. మరోవైపు ఆర్​జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ రాజీనామా చేశారు. నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకొని సెల్దా కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజుల పోలీస్‌ రిమాండ్‌కు అప్పగించింది.

Last Updated : Aug 12, 2024, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.